స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లయినా కూడా, మన దేశ పరిస్థితి ఎలా ఉందో మీరే చూడండి

 

విద్య:

  • మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య మీద పెడుతున్న ఖర్చు మన GDP లో సుమారు 3%. బంగ్లాదేశ్ సుమారు 10% ఖర్చు పెడుతోంది. బోత్స్ వానా, బొలీవియా లాంటి వెనుకబడ్డ దేశాలు కూడా విద్యపై మొత్తం GDP లో 7% పైనే ఖర్చు పెడుతున్నాయి.
  • ప్రపంచంలో ఉన్న టాప్ 300 యూనివర్సిటీల్లో మనదేశపు యూనివర్సిటీ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు.
  • యాస్పైరింగ్ మైండ్స్ అనే సంస్థ అధ్యయనం ప్రకారం మనదేశపు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ లో 20% మంది కూడా ఉద్యోగాలకి సరిపోయే స్కిల్స్ లేవు. అదే అమెరికాలో అయితే 74% మంది జర్మనీలో అయితే 91% మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కాలేజి నుండి బయటకు రావడమే ఉద్యోగాలకి అవసరమైన స్కిల్స్ తో వస్తున్నారు.
  • 74% అక్షరాస్యత సాధించడానికి మనదేశానికి 73 ఏళ్ళు పడితే, బంగ్లాదేశ్ 50 ఏళ్లలో మనతో పోటీ పడే స్థాయికి వచ్చింది. ఆఫ్రికా లోని మొరాకో అనే దేశం కేవలం 10 ఏళ్లలో 70% నుండి 95%అక్షరాస్యత సాధించింది.
  • ఇప్పటికీ మన దేశంలో ఒక లక్ష గ్రామాల్లో ప్రాథమిక పాఠశాల కూడా లేదు అనేది నమ్మక తప్పని నిజం.
  • రీసెర్చ్ కి తగిన సదుపాయాలు లేని కారణంగా, ఇప్పటివరకు సైన్స్ లో మనదేశం నుండి కేవలం నలుగురు మాత్రమే నోబెల్ ప్రైజ్ సాధించారు. వీరిలో కూడా ఇద్దరు విదేశాల్లో పరిశోధనలు చేసినవారే..
  • మనదేశంలో Ph.D కోసం సమర్పించే థీసిస్ లలో 70% వేరే చోట నుండి కాపీ కొట్టినవే అని ఆరోపణలు ఉన్నాయి. విదేశీ సైన్స్ జర్నల్స్ లో పబ్లిష్ అయ్యే స్థాయిలో ఉండే థీసిస్ లు అయితే మనదేశంలో మరీ తక్కువ.
  • ఏటా 3 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం, 40 లక్షల మంది ఉద్యోగాలకోసం మనదేశం నుండి విదేశాలకి వలస పోతున్నారు.
  • మనదేశంలో ఉన్నత విద్యలో 24 మంది విద్యార్థులకి ఒక అధ్యాపకుడు ఉంటే, అదే కెనడా లో 9 మంది విద్యార్థులకిఒకరు, రష్యాలో 10 మంది విద్యార్థులకి ఒకరు, స్వీడన్ లో 12 మంది విద్యార్థులకి ఒకరు, బ్రిటన్ లో 16 మంది విద్యార్థులకి ఒకరు, చైనాలో 19మంది విద్యార్థులకి ఒకరు చొప్పున ఉన్నారు.
  • చాలా రాష్ట్రాలలో ప్రభుత్వ పాఠశాలల్లో 60 -70% ఉపాధ్యాయ పోస్టులు కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్నాయి. దేశం మొత్తం మీద సుమారు లక్ష పాఠశాలల్లో ఒక్కరంటే ఒక్కరే ఉపాధ్యాయులు ఉన్నార ఉన్నార

దేశం అభివృద్ధి చెందడమంటే అద్దా ల మేడలు, రంగుల గోడలు కాదు పౌరుల నైతికాభివృద్దే నిజమైన దేశాభివృద్ధి - మహాత్మా గాంధీ

ఆరోగ్య రంగం:

  • మన ప్రభుత్వాలు ఆరోగ్యం మీద GDP లో 1.3% ఖర్చు పెడుతుంటే, బంగ్లాదేశ్ 3%, బ్రెజిల్ 9%, దక్షిణాఫ్రికా 8%, రష్యా 5%, చైనా 5%, అమెరికా 17% ఖర్చు పెడుతున్నాయి.
  • ఒక్కో మనిషి మీద ఆరోగ్యం కోసం ఏడాదికి మన ప్రభుత్వం రూ. 1944 ఖర్చు చేస్తుంటే, బంగ్లాదేశ్ రూ. 2600, అమెరికా రూ 8 లక్షలు ఖర్చు చేస్తున్నాయి.
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం వెయ్యి జనాభాకు ఒక డాక్టర్ ఉండాలి. మనదేశంలో 1456 జనాభాకు ఒక్క డాక్టర్ ఉంటే, చైనా లో వెయ్యి జనాభాకు 2, అమెరికాలో 3, స్వీడన్ లో 4 చొప్పున డాక్టర్లు ఉన్నారు.
  • మనదేశంలో 10 వేల జనాభాకు 5 హాస్పిటల్ బెడ్స్ అందుబాటులో ఉంటే, బంగ్లాదేశ్ లో 8, అమెరికాలో 30, జర్మనీలో 39, జపాన్ లో 13, కొరియాలో 10 బెడ్స్ ఉన్నాయి. హాస్పిటల్ బెడ్స్ లభ్యతలో 167 దేశాల జాబితాలో మనదేశానికి 155వ స్థానం.
  • చౌకగా లభించే జనరిక్ మందుల వినియోగం పేదలు ఎక్కువగా ఉన్న మనదేశంలో 34% ఉంటే, ధనిక దేశాలు అయిన అమెరికాలో 81%, జర్మనీలో 77%, నెదర్లాండ్ లో 74% ఉంది. ఆశ్చర్యం ఏమిటంటే జనరిక్ మందులు అత్యధికంగా ఉత్పత్తి చేసేది మనదేశమే. అమెరికాలో విక్రయించే జనరిక్ మందుల్లో 40% మనదేశంలో తయారయినవే.
  • మనదేశంలో 8 లక్షల మెడికల్ షాపులు ఉంటే కేవలం 3200 మాత్రమే జన ఔషధి షాపులు ఉన్నాయి.
  • ఆకలితో అలమటించే జనాభా విషయంలో మనదేశం 107 దేశాల లిస్టులో మనదేశం 94వ స్థానంలో ఉంది. ఈ విషయంలో పాకిస్తాన్, నేపాల్ మనకంటే మెరుగ్గా ఉన్నాయి.

ఒక ఆలోచన కోసం ఒక వ్యక్తి చనిపోవచ్చు కానీ ఆ ఆలోచన అతని మరణం తరువాత వేల మంది జీవితాలలో మూర్తీభవిస్తుంది. -సుభాష్ చంద్రబోస్

త్రాగునీరు, పారిశుద్యం

  • మనదేశంలో ఉన్న 80% నీటివనరులు కలుషితం అయ్యాయి. చెత్తవేయడం, మురుగునీరు నేరుగా కలవడం, పారిశ్రామిక కాలుష్యాలను శుద్ధి చేయకుండా నీటిలో కలవడం లాంటి కారణాల వల్ల నదులు, చెరువులు లాంటి నీటివనరులు కలుషితం అవుతున్నాయి.
  • సురక్షిత మంచినీరు లేకపోవడం వల్ల మనదేశంలో డయేరియా తో ఏటా 15 లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు.
  • 2017 లెక్కల ప్రకారం దేశంలో ఉన్న 6 లక్షల గ్రామాలకు గాను, కేవలం 45 వేల గ్రామాలకు మాత్రమే పైప్ లైన్ ద్వారా త్రాగునీటి సరఫరా సౌకర్యం ఉంది. 82% గ్రామీణ కుటుంబాలకు ఇంట్లో త్రాగునీటి కనెక్షన్ లేదు.
  • 2030 నాటికి మన జనాభాలో 40% మంది తీవ్ర తాగునీటి కొరత ఎదుర్కోబోతున్నారు.
  • దేశంలో ఉన్న 780 జిల్లాలకు, 256 జిల్లాలలో భూగర్భ జలవనరులు ప్రమాదకర స్థాయిలో తగ్గిపోతున్నాయి అని కేంద్రం చెబుతోంది.
  • 30,000 గ్రామాలలో త్రాగునీరు మాత్రమే కాదు అసలు ఎలాంటి నీటి వసతీ లేద.
  • గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ 29% కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేవు.
  • 21000 ప్రభుత్వ పాఠశాలలలో మరుగుదొడ్లు లేవు. టాయిలెట్స్ ఉన్నప్పటికీ 30% ప్రభుత్వ పాఠశాలలలో అవి శుభ్రం చేసేవాళ్ళు లేక నిరుపయోగంగా మారాయ.

నిరుద్యోగం :

  • 2011 జనాభా లెక్కలప్రకారం 40% జనాభా అంటే 45 కోట్ల మంది గ్రామాల నుండి పట్టణాలు, నగరాలకు వలస వెళ్ళారు.
  • దేశంలో నిరుద్యోగిత 9% ఉంది అంటే 4 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు.
  • పట్టణ, నగర జనాభాలో 15 -29 ఏళ్ళలోపు ఉన్నవారిలో నిరుద్యోగిత 22% ఉండడం, ఆందోళన చెందాల్సిన విషయం. వేతనాలు తక్కువగా ఉండడం వల్ల ఏదో ఒక పని చేస్తున్న వారిలో కూడా అత్యధికులు పేదలుగా మిగిలిపోతున్నారు.
  • GST అమలులో ఉన్న సమస్యల వల్ల దేశంలో సుమారు 11 కోట్లమందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు ఇబ్బందులు పడుతుండడం, దేశంలో నిరుద్యోగం పెరగడానికి ఒక ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
  • మనదేశం లో పనిచేస్తున్న వారిలో కూడా 98% మందికి ఆ వృత్తికి సంబంధించిన నైపుణ్యాలు లేవు. అదే బ్రిటన్ లో అయితే 68%, చైనాలో 72% మందికి ఏదో ఒక వృత్తి నైపుణ్యం ఉంది.
  • చేజారుతున్న గొప్ప అవకాశం మనదేశపు జనాభా సగటు వయసు 29 ఏళ్ళు. అంటే “దేశంలో పనిచేసే వయసు వాళ్ళు ఎక్కువ - వారిపై ఆధారపడే వాళ్ళు తక్కువ” ఉన్నారు. దీన్ని డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు. ఇది ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టాల్సిన సమయం. ఇంకో పదేళ్ళు కనుక ప్రభుత్వాలు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే భవిష్యత్తులో దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇంకో ఇరవై ఏళ్ళకి “పనిచేయగలిగే వాళ్ళు తక్కువ- ఆధారపడే వాళ్ళు ఎక్కువ” అవుతారు. ఇది అశాంతికి, ఆర్ధిక పతనానికి దారితీస్తుంది.

ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, ప్రజా సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి ఆదర్శం - స్వామి వివేకానంద

పారిశ్రామిక ప్రగతి:

  • దేశంలో ఉన్న MSME పరిశ్రమల్లో 99.4% సూక్ష్మ పరిశ్రమలే. 0.5% పరిశ్రమలు మాత్రమే, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు.
  • మనదేశంలో 58% మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. కానీ, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలా వ్యవసాయంపై ఆధారపడిన జనాభా 15% లోపే.
  • కరోనా సంక్షోభం కారణంగా చైనా నుండి తరలి వెళ్తున్న పరిశ్రమలను ఆకర్షించడంలో మనదేశం విజయం సాధించలేక పోయింది. వియత్నాం లాంటి దేశం పరిశ్రలను చైనా నుంచి తన దేశం కి తీసుకెళ్లడం లో విజయం సాధించింది.
  • దేశంలో వస్తూపత్తి రంగంలో ఉన్న 86% చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవు.ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ చేసుకునే ప్రక్రియ సంక్లిష్టంగా, కష్టంగా ఉండడంతో ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే ఇవి నడుస్తున్నాయి. దీనితో పెట్టుబడికి, బ్యాంక్ రుణాలు లభించక, ప్రైవేట్ వడ్డీవ్యాపారులనుండి అధిక వడ్డీకి రుణాలుతీసుకుంటున్నారు.
  • దేశంలో 11204 గ్రామాలకు కనీసం రోడ్డు వసతి కూడా లేదు. దీనితో ఈ గ్రామాల్లో ఇతర ఉపాధి అవకాశాలు దొరకడం లేదు.
  • వినూత్న ఆవిష్కరణలు, పరిశోధనల్లో మనదేశం వెనుకబడి ఉండడంతో, టెక్నాలజీ విషయంలో మన పరిశ్రమలు ఇప్పటికీ విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది.
  • మనదేశంలో Startups లలో కేవలం 10% మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. ఈ సక్సెస్ రేట్, ఇజ్రాయిల్ లో 95%, జపాన్ లో 71%, అమెరికాలో 58% ఉంది.
  • వస్తువులని ఉత్పత్తి చేసే ఎగుమతి చేయగలిగే సామర్థ్యం అంటే Competitive Industrial Performance లో జపాన్ 1 వ స్థానంలో ఉంటే, జర్మనీ 2 వ స్థానంలో, అమెరికా 3 వ స్థానంలో, సౌత్ కొరియా 4 స్థానంలో, ఫ్రాన్స్ 10 వ స్థానంలో ఉన్నాయి. మనదేశం 68వ స్థానంలో ఉంది.
  • వస్తూపత్తి రంగంలో ఉన్న పరిశ్రమలు ప్రభుత్వ అనుమతులు పొందడం సంక్లిష్టంగా ఉండడంతో, మనదేశంలో వస్తువులు ఉత్పత్తి చేయడం కన్నా దిగుమతి చేసుకోవడం చౌకగా మారింది. వస్త్రాలు, చర్మ వస్తువులు, ఇనుము, చిన్న చిన్న మెషిన్లు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు లాంటి వాటికి కావాల్సిన ముడి సరుకును మనం విదేశాలకు ఎగుమతి చేసి, అదే వస్తువులు అక్కడ నుండి మనం దిగుమతి చేస

నా దేశంలో భారీ ఉత్పత్తులు కావలి.. అవి కార్పొరేట్ల ద్వారా కాదు జనసామాన్యం నుంచి రావాలి. - పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ

పట్టణీకరణ, వలసలు :

  • మన దేశ జనాభాలో 65% గ్రామాల్లో నివసిస్తున్నారు. పరిశ్రమలు నగరాలూ, పట్టణాలలోనే కేంద్రీకృతం అవుతుండడంతో, గ్రామాల్లో ఉపాధి లేక పట్టణాలకు వలస పోతున్నారు. ఆఖరికి వ్యవసాయాధార పరిశ్రమలు కూడా గ్రామాలకు దూరంగా నగరాల్లో ఏర్పాటు చేస్తుండడంతో వలసలు పెరిగిపోతున్నాయి.
  • 2025 నాటికి, మనదేశ జనాభాలో 46% మంది పట్టణాలు, నగరాల్లో జీవిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి.
  • అర్బనైజేషన్ వల్ల పట్టణాల్లో మౌలిక వసతుల కొరత ఏర్పడి, మురికివాడలు, పట్టణ దారిద్ర్యం, పట్టణాల్లో నేరాలు పెరుగుతున్నాయి.
  • పట్టణాలు, నగరాలూ దేశ ఆర్ధిక ప్రగతికి చోదక శక్తిగా పనిచేస్తున్నాయి కానీ, పట్టణ పేదరికాన్ని మాత్రం తగ్గించలేకపోతున్నాయి. పట్టణాలు, నగరాలలో నివసించే ప్రతి నలుగురిలో ఒకరు స్లమ్ లలో జీవిస్తుండమే దీనికి సాక్ష్యం.

అప్పుల్లో భారతదేశం:

  • జూన్ 2020 నాటికి మన దేశానికి ఉన్న అప్పులు100 లక్షల కోట్లకు చేరాయి.2014 మార్చి నాటికి ఈ అప్పు 53లక్షల కోట్లే.
  • కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా, పాత అప్పులపై 6 లక్షల కోట్లు వడ్డీ కడుతోంది. ఏడాదికి 6 లక్షల కోట్ల చొప్పున కొత్త అప్పులు తీసుకుంటోంది. అప్పుల భారం పెరిగిపోవడంతో, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడుతోంది.
  • 2007లో ఒక వ్యక్తిపై అప్పు 50వేల రూపాయలు ఉంటే, ఇప్పుడు అది లక్ష రూపాయలకు చేరింది.

మొండి బకాయిలు, రుణాల ఎగవేత:

  • మొండి బకాయిలు, రుణాల ఎగవేతల్లో మనదేశం ప్రపంచంలో 5 వ స్థానంలో ఉంది. ప్రభుత్వ బ్యాంకుల నిరర్థక ఆస్తుల విలువ (NPA) మొత్తం 7.27 లక్షల కోట్లకు చేరింది. బ్యాంకుల మొత్తం రుణాలలో ఇది 10% ఉంటుంది.
  • రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం 2017-18 నాటికి ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకుల నిరర్థక ఆస్తుల (NPA) విలువ 9.63 లక్షల కోట్లు. దీనిలో కేవలం 85,000 కోట్లు మాత్రమే వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఇచ్చిన రుణాలు ఉన్నాయి. మొత్తం నిరర్థక ఆస్తులలో వ్యవసాయ రుణాల వాటా కేవలం 9% మాత్రమే.
  • పరిశ్రమలకు బ్యాంక్ రుణాల రైట్ ఆఫ్ వల్ల లబ్ది పొందింది దేశంలో 100 మంది లోపు మాత్రమే అనేది విస్తుగొలిపే వాస్తవం. బ్యాంకులు రైట్ ఆఫ్ చేసిన 9 లక్షల కోట్ల రుణాలలో మోడీ ప్రభుత్వం వచ్చాక రైటాఫ్ చేసిన రుణాల మొత్తం 7 లక్షల కోట్లు.

“విప్లవాలు, నేరాలు పేదరికం నుంచే పుట్టుకు వస్తాయి” - ఆరిస్టాటిల్

కుంభకోణాలు :

  • గత 20 ఏళ్లలో జాతీయ స్థాయిలో వివిధ కుంభకోణాల వల్ల సుమారు 4 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దోపిడీ అయింది.
  • బొగ్గుకుంభకోణం విలువ 1.86 లక్షల కోట్లు, 2G స్కాం విలువ 1.76 లక్షల కోట్లు, కామన్ వెల్త్ గేమ్స్ స్కాం 70 వేలకోట్లు, నీరవ్ మోడీ PNB స్కాం 11,400 కోట్లు, సత్యం స్కాం:14000 కోట్లు, విజయ్ మాల్యా PNB స్కాం 9000 కోట్లు.

ఎగుమతులు, దిగుమతులు:

  • మనదేశం చేసుకునే దిగుమతుల విలువ 6,17,946 మిలియన్ యుఎస్ డాలర్లు అయితే మనదేశం చేసే ఎగుమతుల విలువ 3,22,292 మిలియన్ యుఎస్ డాలర్లు. అంటే ఏటా 3 లక్షల మిలియన్ యుఎస్ డాలర్ల వాణిజ్య లోటు ఉంది.
  • మనం చైనా నుండి 75 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు చేసుకుంటుంటే, మనం చేసే ఎగుమతుల విలువ 18 బిలియన్ డాలర్లు ఉంటోంది. అంటే మనం చైనాకు ఎగుమతి చేసే దాని కన్నా దిగుమతుల విలువ 57 బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉంది.
  • చైనా మొత్తం ఎగుమతుల విలువ 2.3 ట్రిలియన్ డాలర్లు. అంటే మనదేశ మొత్తం GDPలో 2/3 వంతు ఉంటుంది.

శాంతిభద్రతలు:

  • నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం గత ఏడాది దేశంలో 32033 అత్యాచారాలు జరిగాయి. అంటే రోజుకి 88, ప్రతి 20 నిమిషాలకి ఒక అత్యాచారం జరుగుతున్నాయి. (ఇది పోలీసుల దృష్టికి వచ్చిన కేసుల సంఖ్య మాత్రమ).
  • మహిళలు, బాలికలపై నేరాలు, అక్రమ రవాణా కేసుల్లో 136 దేశాల జాబితాలో మనం 7 వ స్థానంలో ఉన్నాము.
  • మనదేశంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిలో కేవలం 28% మందిపై మాత్రమే నేరాలు రుజువై వారికి శిక్ష పడుతోంది. అంటే 100 మందిపై నేరారోపణలు ఉంటే 28 మంది మాత్రమే దోషులుగా శిక్షలకి గురవుతున్నారు.

వ్యవసాయం, అనుబంధ రంగాలు:

  • మానవ వినియోగం కోసం పండించే పంటలో మూడో వంతు వృధా అవుతోంది. మరోపక్క ప్రతి 7 గురిలో ఒకరు ఆకలితో అలమటిస్తున్నారు.
  • మనదేశంలో మొత్తం 9 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ చేసే సామర్థ్యం ఉంది. మరో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ కోసం గోడౌన్స్ నిర్మించాల్సి ఉంది.
  • దేశంలో ఉన్న మొత్తం వ్యవసాయ భూమి 40 కోట్ల ఎకరాలు కాగా, దీనిలో 49% భూములకే అంటే 19 కోట్ల ఎకరాలకు సాగునీటి వసతి ఉంది. మిగిలిన 51% అంటే 20 కోట్ల ఎకరాలలో వ్యవసాయం వర్షాధారమే.
  • 2007 – 2017 మధ్య దేశంలో భూగర్భ జలాలు 61% అడుగంటాయి. ఈ నీటిలో 89 % వ్యవసాయానికి ఉపయోగించారు. నీళ్ళు ఎక్కువగా అవసరం ఉండే వరి, గోధుమలు, పత్తి లాంటి పంటలకి కూడా భూగర్భ జలాలను ఉపయోగిస్తుండడమే దీనికి ప్రధాన కారణం.
  • ఒక కేజీ బియ్యం పండించాలి అంటే 5 వేల లీటర్ల నీళ్ళు కావాలి, ఒక కేజీ పత్తి పండించాలి అంటే 10 వేల లీటర్ల నీళ్ళు కావాలి. అందుకే చాలా దేశాలు పత్తిని, బియ్యాన్ని దిగుమతి చేసుకుంటున్నాయి.
  • మనదేశం ఎక్కువ నీటి వినియోగం, తక్కువ ఆదాయం ఉండే బియ్యాన్ని ఎగుమతి చేస్తోంది. తక్కువ నీటి వినియోగం, ఎక్కువ ఆదాయం వచ్చే కూరగాయల సాగును నిర్లక్ష్యం చేస్తోంది.
  • గత పదేళ్ళలో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు 5 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేసాయి.
  • సాగుకి యోగ్యమైన భూములు అమెరికాలో 90 కోట్లు ఉంటే, మనదేశంలో 40 కోట్ల ఎకరాలు ఉన్నాయి. అంటే ఈ విషయంలో మనం నంబర్ 2 గా ఉన్నాం. కానీ, పంటల దిగుబడి విషయంలో మనం మనకన్నా తక్కువ భూమి ఉన్న దేశాలతో కనీసం పోటీ పడలేకపోతున్నాం. ఒక్కో ఏడాది మనదేశం లో కనీసం 25% అంటే 10 కోట్ల ఎకరాలలో అసలు వ్యవసాయమే చేయడం లేదు.
  • మనదేశ GDP లో 16% వ్యవసాయం నుండి వస్తుంటే, దానిపై 58% మంది ఆధారపడి ఉన్నారు. 29% ఆదాయం పరిశ్రమల నుండి వస్తుంటే 9% మంది ఆధారపడి ఉన్నారు. 44% ఆదాయం వస్తున్నా సర్వీస్ సెక్టార్ పై 33% మంది ఆధారపడి ఉన్నారు.
  • మనదేశంలో వ్యవసాయంపై అధికభారం మోపుతున్నాం. చాలా దేశాలు, మనతో పోలిస్తే 10% మానవవనరులతో మనతో సమానంగా దిగుబడులు సాధిస్తున్నాయి. జర్మనీ లో కేవలం 1.7% , జపాన్ లో 10%, ఇటలీ లో 5.5% జనాభా మాత్రమే వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు.

న్యాయవ్యవస్థ:

  • 10 లక్షల జనాభా కి 50 మంది జడ్జిల అవసరం ఉంటే, మనదేశంలో 20 మంది మాత్రమే జడ్జీలు ఉన్నారు.
  • సుప్రీం కోర్టులో 60,000 కేసులు, హైకోర్టులలో 42 లక్షల కేసులు, జిల్లా కోర్టులలో 2.7 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి.
  • 130 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో కేవలం 664 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మాత్రమే ఉన్నాయి.
  • బాలలపై హింస, అత్యాచారాల నిరోధక చట్టం POCSO కేసులలో 88.8% కేసులు పెండింగ్ లో ఉన్నాయి. కేవలం 35% కేసులలో మాత్రమే దోషులకి శిక్ష పడుతోంది.
  • చట్ట బద్ధ పాలన అంటే రూల్ ఆఫ్ లా అమలు జరుగుతున్న తీరుని బట్టి 128 దేశాలకు ర్యాంకులు ఇస్తే మనదేశానికి 69వ ర్యాంక్ వచ్చింది. అభివృద్ధి చెందుతున్న దేశాల ర్యాంకింగ్ లో ఘనా అనే దేశం నంబర్ 1 వచ్చింది.

“కులం పునాదుల మీద మీరు ఏమి సాధించలేరు, ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు - డా|| బీ. ఆర్. అంబేడ్కర

కాలుష్యం:

  • ప్రపంచ వ్యాప్తంగా 30 అత్యంత కాలుష్య నగరాల జాబితా రూపొందిస్తే, అందులో 21 నగరాలు మన దేశంలోనే ఉన్నాయి.
  • వాయు కాలుష్యం కారణంగా వచ్చే జబ్బులతో 2019 లో 20 లక్షల మంది మనదేశంలో చనిపోయారు.

క్రీడలు:

  • మన జనాభా సంఖ్యతో మనకి వచ్చిన ఒలింపిక్ మెడల్స్ పోల్చుకుంటే సిగ్గుపడక తప్పదు. మొత్తం 70 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో మనదేశం కేవలం 28 మెడల్స్ మాత్రమే సాధించింది. అమెరికా కు చెందిన Michal Phelpes ఒక్కడే సాధించిన మెడల్స్ కన్నా ఇది తక్కువ.
  • వ్యక్తిగత కేటగిరీల్లో మనకి ఒక్కటంటే ఒక్కటే గోల్డ్మెడల్ వచ్చింది. ఒకప్పుడు హాకీలో మనకి గోల్డ్మెడల్స్ వచ్చాయి.ఇప్పుడు ఆ హాకీలో కూడా1980 తర్వాత ఒక్క గోల్డ్మెడల్ రాలేదు.
  • మనదేశానికి మొట్టమొదటి ఒలింపిక్ మెడల్ సాధించిన KD జాదవ్, ఎలాంటి గుర్తింపు నోచుకోక పేదరికం వల్ల మరణించాడు.
  • క్రికెట్ తప్ప, అత్యధిక ఆదాయం వచ్చే రగ్బీ, సాకర్, టెన్నిస్ లాంటి ఆటల్లో మనదేశం చాలా వెనుకబడి ఉంది. మన ప్రభుత్వాలు ఏడాదికి ఆటలపై 2600 కోట్లు ఖర్చు పెడుతుంటే, USA 3 లక్షల కోట్లు, చైనా 4 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాయి. 1950 తర్వాత మనం ఫుట్ బాల్ వరల్డ్ కప్ కి అర్హత సాధించలేకపోయాం.

“మనుషులను చంపగలరేమో కానీ, వారి ఆదర్శాలను మాత్రం కాదు. ” - భగత్ సింగ్

పర్యాటకం :

  • మనదేశంలో 38 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. పర్యాటకం ద్వారా ఏడాదికి 16.91 లక్షల కోట్ల ఆదాయం వస్తోంది. అమెరికా 73 లక్షల కోట్లు, మనతో పోల్చుకుంటే చిన్న దేశం అయిన థాయిలాండ్ 6 లక్షల కోట్లు సంపాదిస్తున్నాయి.

రోడ్డు ప్రమాదాలు :

  • రోడ్డు ప్రమాదాల వల్ల మనదేశం ఏటా 3.25% GDP నష్టపోతోంది అని IIT ఢిల్లీ అంచనా వేసింది.
  • రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య విషయంలో మనదేశం 199 దేశాలలో మొదటి స్థానంలో ఉంది.*
  • ప్రపంచంలో ఉన్న మొత్తం వాహనాల్లో మనదేశంలో ఉన్నవి 2% మాత్రమే అయినా, ప్రమాదాల్లో మన వాటా 11% ఉంది.
  • మనదేశంలో 60% డ్రైవింగ్ లైసెన్సులు ఎలాంటి టెస్టింగ్ లేకుండానే ఇచ్చేస్తున్నారు.
  • ట్రాఫిక్ జామ్ ల వలన దేశం ఏటా 1.5 లక్షల కోట్లు నష్టపోతోంది.