ఆదర్శ గ్రామ అభివృద్ధి

 

ఆదర్శ గ్రామాలు

గ్రామాలని అభివృద్ధి చేయాలని,గ్రామీణ ప్రజల జీవనప్రమాణాలుమెరుగుపరచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి, ఎన్నో పథకాలు ప్రారంభిస్తున్నాయి. ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కావచ్చు, మరేదైనా కావచ్చు. దేశంలో అతి కొద్ది గ్రామాలలో మాత్రమే సత్ఫలితాలు ఇచ్చాయి.

దేశం మొత్తం మీద ఆదర్శ గ్రామాల సంఖ్య 500 లోపే అనేది నమ్మలేని నిజం. ఆదర్శ గ్రామాల నిర్మాణం కోసం జరిగిన సఫల ప్రయత్నాలను, విఫల ప్రయత్నాలను మేము జాగ్రత్తగా అధ్యయనం చేసాం. గ్రామాల ఎంపిక దగ్గర నుండి ప్రజల నిరంతర భాగస్వామ్యాన్ని కొనసాగించడం దాకా అన్ని కోణాలను మేము పరిశీలించాం. మా అధ్యయనం ప్రకారం..

ఆదర్శ గ్రామం అంటే..?

1

జీవన నాణ్యత మెరుగుపడడం

2

100% డిజిటల్ విలేజ్

3

పాలనలో ప్రజల భాగస్వామ్యం పెంచడం

4

ప్రజల తలసరి ఆదాయాలలో వృద్ధి

ఈ నాలుగు సాధించగలిగితే , ఆ గ్రామాన్ని ఆదర్శగ్రామం అని చెప్పవచ్చు.

ఈ నాలుగు లక్ష్యాలను మరింత వివరంగా చూద్దాం ...

1.1 పరిశుభ్రమైన పరిసరాలు

 • పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం
 • 100% ODF గ్రామంగా మార్చడంతోపాటు, అది నిరంతరం అమలు జరిగేలా చూడడం
 • చెత్త నిర్వహణలో సమస్యలు గుర్తించి పరిష్కారాలు సూచించడం
 • పారిశుద్ధ్య పనులపై ప్రజల నిఘా పెరిగేలా చూడడం
 • తదితర మార్గాలలో పరిశుభ్రమైన పరిసరాలను రూపొందించడం.

1.2 చక్కని వైద్య, ఆరోగ్య సేవలు

 • గ్రామంలో ఉన్న సబ్ సెంటర్/PHC ల లో మౌలిక వసతులు కల్పించడం.
 • కుర్చీలు, బెంచీలు, రిఫ్రిజిరేటర్ లాంటి అవసరాలు అన్నీ ఆరునెలల్లో సమకూర్చడం
 • ఆశా వర్కర్స్ ను సమర్థవంతంగా వినియోగించడం
 • గ్రామంలో నివాసం ఉండే ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ ను సిద్ధం చేయడం.
 • వారికి అవసరమైన సేవలు అందేలా చూడడం.

1.3 పిల్లలకు మంచి విలువలతో కూడిన చదువు

 • గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో వచ్చే ఆరునెలల్లో మౌలిక వసతులు కల్పించడం
 • తల్లిదండ్రుల కమిటీ సక్రమంగా పనిచేసేలా చూడడం
 • మధ్యాన్న భోజన నాణ్యత పెంచడం
 • పిల్లలలో నైతిక విలువలు పెంపొందించేందుకు స్వచ్చంద సంస్థల సహకారంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం.

1.4 కల్తీలు లేని ఆహారం

 • 100% కల్తీలు లేని ఆహారం ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవడం కోసం..హైస్కూల్, కళాశాల విద్యార్థులు, డ్వాక్రా మహిళల భాగస్వామ్యంతో ఆహార కల్తీలు గుర్తించే పరీక్షలు చేయించడం.

1.5 యువజన సాధికారత

 • గ్రామంలో ఉన్న యువత కి ఉన్న నైపుణ్యాలు గుర్తించడం, వారికి తగిన ఉపాధి అవకాశాలు స్థానికంగా కల్పించే మార్గాలు సూచించడం.
 • అదనపు స్కిల్స్ నేర్పించడం
 • వ్యవసాయ పనులు, ఇతర వృత్తులలో ఉన్న యువతకి మెరుగైన జీవనం కోసం ప్రయత్నాలు చేయడం
 • యువతని మోటివేట్ చేసే కార్యక్రమాలు చేపట్టడం, వారిలో ఉన్న కళలని ప్రదర్శించుకునే ఏర్పాట్లు చేయడం.

1.6 మహిళల సమగ్రాభివృద్ధి

 • గ్రామంలో ఉన్న యువత కి ఉన్న నైపుణ్యాలు గుర్తించడం, వారికి తగిన ఉపాధి అవకాశాలు స్థానికంగా కల్పించే మార్గాలు సూచించడం.
 • అదనపు స్కిల్స్ నేర్పించడం
 • వ్యవసాయ పనులు, ఇతర వృత్తులలో ఉన్న యువతకి మెరుగైన జీవనం కోసం ప్రయత్నాలు చేయడం
 • యువతని మోటివేట్ చేసే కార్యక్రమాలు చేపట్టడం, వారిలో ఉన్న కళలని ప్రదర్శించుకునే ఏర్పాట్లు చేయడం.

2.1 గ్రామ పంచాయితీ సమర్థవంతంగా పనిచేసేలా చూడడం

 • గ్రామ పంచాయితీ సమర్థవంతంగా పనిచేసేలా చూడడం కోసం ప్రజాప్రతినిధులకి మోటివేషన్ తరగతులు నిర్వహించడం
 • ఉత్తమ ప్రతిభ కనబరచినవారికి ప్రైవేట్ సంస్థల ద్వారా ప్రోత్సాహకాలు అందించడం
 • ఈ గవర్నెన్స్, M గవర్నెన్స్ పద్ధతులు అమలు జరిగేలా చూడడం.

2.2 ప్రజల ఫిర్యాదులపై తక్షణ స్పందన, సత్వర పరిష్కారం

 • ప్రజలు చేసే ఫిర్యాదులపై తక్షణ స్పందన అంటే.. “మీ ఫిర్యాదు అందింది, దాన్ని సంబంధిత అధికారికి పంపాము” అనే సమాచారం ఫిర్యాదుదారునికి అదే రోజు అందించడం
 • ఆ ఫిర్యాదు వీలయినంత త్వరగా పరిష్కారం అయేలా చర్యలు తీసుకోవడం కోసం తగిన ఏర్పాట్లు చేయించడం.

2.3 ప్రజల్లో పౌర స్పృహని పెంచడం

 • గత పదేళ్ళలో ప్రతి పనికి ప్రభుత్వం మీద ఆధారపడడం, ప్రతి సమస్యకి ప్రభుత్వాలని నిందించడం బాగా పెరిగింది. దీనివల్ల చిన్న పాటి చొరవ చూపిస్తే గ్రామంలో పరిష్కరించుకోదగిన సమస్యలు కూడా పరిష్కారం కాకుండా ఏళ్ళకి ఏళ్లు పెండింగ్ లో ఉండిపోతున్నాయి.
 • మరోపక్క ప్రజల్లో “మన గ్రామం, మన పట్టణం, మన రాష్ట్రం” అనే భావన తగ్గిపోయింది. ప్రజల్లో పౌర స్పృహ పెంచడం, పౌర బాధ్యతలపై అవగాహన కల్పించడం కోసం తగిన కార్యక్రమాలు చేపట్టడం.

3. 100% డిజిటల్ విలేజ్

 • గ్రామంలో ప్రతి ఇంటికి ఇంటర్ నెట్ కనెక్షన్ ఇవ్వడం
 • ప్రతి కుటుంబంలో ఒకరికి డిజిటల్ అక్షరాస్యత నేర్పడం
 • ప్రతి కుటుంబం మొబైల్ లేదా ఇంటర్నెట్ బ్యాకింగ్, e- గవర్నెన్స్, m-గవర్నెన్స్ సేవలు ఉపయోగించుకునేలా చేయడం
 • డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయడం ద్వారా 100% డిజిటల్ విలేజ్ గా తీర్చిదిద్దడం.

4.1 వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం

 • గ్రామానికి చెండియా వ్యవసాయ భూములలో 100% భూసార పరీక్షలు చేయించడం.
 • గ్రామంలో పండే పంటలకి ఎక్కడ మంచి మార్కెట్ ఉంటుందో గుర్తించి అక్కడ రైతులు అమ్ముకునేలా ప్రోత్సహించడం, e- NAM ను వినియోగించుకునేల చేయడం.
 • వ్యవసాయ ఉత్పత్తులకి మెరుగైన ప్యాకింగ్, రవాణా సౌకర్యాలు కల్పిచడం
 • వ్యవసాయ శాఖ అధికారులు రైతులకి మెరుగైన సేవలు అందించేలా ప్రోత్సహించడం
 • రైతు సంఘాల బలోపేతం; తదితర మార్గాలలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం.

4.2 వ్యవసాయేతర ఉపాధి అవకాశాలు పెంచడం

 • గ్రామంలో ఉన్న వ్యవసాయేతర ఉపాధి అవకాశాలు గుర్తించడం, ప్రోత్సహించడం
 • పశుపోషణ, పౌల్ట్రీ లాంటి ఇతర వృత్తులను ప్రోత్సహించడం.
 • కులవృత్తులు, చేతి వృత్తుల వారికి అదనపు ఆదాయం కల్పించే మార్గాలు సూచించడం
 • స్థానిక వనరులను అనుసరించి గ్రామంలో ఎలాంటి పరిశ్రమలకి, వ్యాపారాలకి అవకాశం ఉందో గుర్తించి వాటిని నెలకొల్పేలా ప్రోత్సహించడం లాంటి చర్యలు తీసుకోవడం.
ఇవన్నీ జరిగితేనే, అప్పుడు ఆ గ్రామాన్ని ఆదర్శగ్రామం అని చెప్పవచ్చు.

అయితే, ఒక గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చాలంటే కేవలం డబ్బు ఒక్కటే సరిపోదు. ఆ గ్రామస్తుల భాగస్వామ్యం అనేది అన్నిటికన్నా కీలకం.

“మీ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాను, మీరు సహకరిస్తారా అని ఏ గ్రామ ప్రజలను అడిగినా సహకరిస్తాం అనే హామీ ఇస్తారు. కానీ ఆ తర్వాత గ్రామ రాజకీయాలు, ముఠా తగాదాలు, కులాల మధ్య వివాదాలు లాంటివి అన్నీ ముందుకు వస్తాయి. దానితో డబ్బు ఖర్చు అవుతుంది కానీ ఆశించిన ఫలితం రాదు.

ఈ సమస్యలను అతి దగ్గరచూడడంతోపాటు, కొన్ని సమయాల పరిష్కారంలో కూడా భాగం పంచుకున్న
జనపక్షం సంస్థ మీకు ఈ దిశగా సహకరించగలదు.

జనపక్షం అందించే సేవలు.

 • గ్రామాలను అసెస్ చేయడం
 • గ్రామ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం
 • గ్రామ ప్రజల్లో అవగాహన చైతన్యం పెంచే కార్యక్రమాలు రూపొందించడం
 • మానిటరింగ్ మెకానిజం ను ఏర్పాటు చేయడం
 • టెక్నికల్ సపోర్ట్ అందించడం
 • గ్రామస్తులకు ఫీల్డ్ విజిట్స్ అరేంజ్ చేయడం
 • రిసోర్స్ మ్యాపింగ్ చేయడం
 • నిధుల సమీకరణ మార్గాలు ప్రతిపాదించడం

గ్రామాభివృద్ధి కార్యక్రమాలపై మా బృందానికి పాషన్, అనుభవం ఎక్స్ పోజర్ ఉన్నాయి.
కాబట్టి ఆదర్శ గ్రామాల అభివృద్ధి కోసం మా సేవలను వినియోగించుకోవలసిందిగా కోరుతున్నాము .