భారతదేశ భవిష్యత్తు యువకుల చేతుల్లో ఉంది. ఈ దేశానికి విలువైన ఆస్తి యువతరమే. యువత ఎక్కువ కలిగిన మన దేశానికి ఇదొక వరం. భారతదేశ భవిష్యత్తుకు వెన్నుముక మన యువత. యువత నడుంబిగిస్తే ప్రపంచ పటంలో మన భారతదేశం అగ్రభాగాన నిలబడుతుంది.

నేటి సమాజంలో ఎంతో మంది యువకులు రాజకీయాల్లోకి రావాలని ఆశయంతో ఉన్నప్పటికీ, ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ వాళ్లను ముందుకు రానివ్వడం లేదు. ఎదగనివ్వడం లేదు. ఎవరైనా ధైర్యం చేసి ఎదగడానికి ప్రయత్నిస్తే అణిచివేతకు గురవుతున్నారు. అయితే సమాజం పట్ల బాధ్యత, అవగాహన, మాతృదేశానికి సేవ చేయాలన్న ధృఢ సంకల్పం, గొప్ప ఆశయం ఉన్న యువకులను గుర్తించి వాళ్లకు ఒక వేదికను ఇచ్చి వాళ్లను ప్రజలపక్షాన నిలబడేలా చేయడమే జనపక్షం ఉద్యమ సంస్థ ద్వారా ఏర్పాటు చేయనున్న మాక్ అసెంబ్లీ యొక్క ప్రధాన లక్ష్యం.

మాక్ అసెంబ్లీ గైడ్‌లైన్స్

తెలంగాణలో ఏర్పాటు చేసే మాక్ అసెంబ్లీ కోసం 119 మంది ఎమ్మెల్యేలను మరియు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసే మాక్ అసెంబ్లీ కోసం 175 మంది ఎమ్మెల్యేలను ఎంపిక చేయబడుతుంది.
ఇందులోంచే పాలకపక్షం, ప్రతిపక్షంగా విభజించడం జరుగుతుంది.
ఒకరు ముఖ్యమంత్రిగా, మరొకరు స్పీకర్‌గా, ఇంకొకరు గవర్నర్‌గా వ్యవహరిస్తారు.
ఇలా ఒక రోజంతా అసెంబ్లీ సమావేశాలలాగే డేలాంగ్ సెషన్ ఏర్పాటు చేయబడుతుంది.
ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలకు మంత్రులు జవాబులు ఇస్తారు.
మాక్ అసెంబ్లీ ద్వారా మీకు ఒకరోజు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా మీ వాణిని వినిపించే అవకాశాన్ని జనపక్షం మీకు కల్పిస్తోంది.
మాక్ అసెంబ్లీలో మీరు లేవనెత్తిన సమస్యలను డ్రాఫ్ట్ చేసి స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రికి అందజేయడం జరుగుతుంది.
img

రండి... మీలోని యువశక్తిని మేల్కొల్పండి... మాక్ అసెంబ్లీలో మీరూ భాగస్వాములు కండి...
రాజకీయాల్లోకి వచ్చి దేశాన్ని మార్చాలన్న మీ ఆశయాలకు ఇక్కడి నుంచే పిడికిలి బిగించి కదలండి...
ఇప్పుడే ఈ క్రింది అప్లికేషన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని మీ సీటుని రిజర్వ్ చేసుకోండి. మీతోపాటు మీలాంటి ఆశయాలు,
కోరికలు ఉన్న మీ మిత్రులను కూడా మాక్ అసెంబ్లీలో భాగస్వామ్యులు అయ్యేలా ప్రోత్సహించండి.

ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు క్రింద ఉన్న అప్లికేషన్ నింపి రిజిస్టర్ చేసుకోగలరు

స్వస్థలం:
మీరు ప్రస్తుతం విద్యార్థి అయితే ?
యూనివర్సిటీ / కాలేజీ పేరు

మీరు ఏ రాష్ట్రం యొక్క మాక్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటున్నారు?

మీరు ప్రస్తుతం ఏదైనా రాజకీయ పార్టీలో లేదా వేరే ఏదైనా ఆర్గనైజేషన్‌లో పని చేస్తున్నారా ?

పార్టీ పేరు / సంస్థ పేరు:

రిఫర్ చేసిన వారు / సలహాలు ఏమైనా ఉంటె: